కరన్‘కోటపై’ కాంగ్రెస్ పాగా
● బరినుంచి తప్పుకున్న
బీఆర్‌ఎస్ మద్దతుదారులు
● ‘రాజకుమారుడే’ సర్పంచ్
తాండూరు రూరల్: కరన్‌కోట్ మేజర్ గ్రామ పంచాయతీ ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. బీఆర్‌ఎస్ మద్దతుదారుడు వీణాహేమంత్ చివరి రోజున నామినేషన్‌కు నిరాకరించడంతో, చివరి నిమిషంలో బోయ అశోక్‌కుమార్, ప్రభాకర్‌గౌడ్‌తో నామినేషన్ వేయించారు. బుధవారం వీరు కూడా బరి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ మద్దతుదారుడు రాజ్‌కుమార్ యునానిమస్ సర్పంచ్‌గా ఎన్నికై నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దల సూచనలతో అశోక్, ప్రభాకర్ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. అనంతరం పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కరన్‌కోట్‌లో ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందన్నారు. అశోక్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారని మండిపడ్డారు. పంచాయతీ చరిత్రలో రెండోసారి కరన్‌కోట్ ఏకగీవ్రమైందని స్థానికులు తెలిపారు. గతంలో రాజప్ప యునానిమస్‌గా ఎన్నిక కాగా, ప్రస్తుతం రాజ్‌కుమార్‌ను పదవి వరించిందన్నారు.
కరన్‘కోటపై’ కాంగ్రెస్ పాగా


