ఎదురెదురుగా బైక్‌ల ఢీ
కొడంగల్ రూరల్: ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని 163 జాతీయ రహదారి బూల్కాపూర్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఇదే ఘటనలో ఓ దంపతులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుర్వ దస్తప్ప, రాములమ్మ బుధవారం తమ బైక్‌పై కొడంగల్ పట్టణానికి వ్యక్తిగత పనుల నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి పట్టణానికి చెందిన మణికొండ చెన్నయ్య(24) కొడంగల్ పట్టణం నుంచి తన బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో బూల్కాపూర్ గేటు సమీపంలో ఎదురుగా బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా క్షతగాత్రులను కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చెన్నయ్య మృతిచెందాడని తెలిపారు. దస్తప్ప, రాములమ్మలకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మృతుడు చెన్నయ్యకు ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
● యువకుడి దుర్మరణం
● దంపతులకు తీవ్ర గాయాలు
ఎదురెదురుగా బైక్‌ల ఢీ
ఎదురెదురుగా బైక్‌ల ఢీ


