కాంక్రీట్ మిల్లర్ లేబర్ సంక్షేమానికి కృషి
చేవెళ్ల: కాంక్రీట్ మిల్లర్ లేబర్ అసోసియేషన్ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.గోపాల్ అన్నారు. మండలకేద్రంలో మంగళవారం కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్ మేసీ్త్రలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల అకాల మరణం చెందిన పవన్‌కుమార్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంఘం మిల్లర్ లేబర్‌కు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్ సీఐ సతీష్ మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడికి లేబర్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డుపైకి వచ్చే కార్మికులు లైసెన్స్‌లు పొంది ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సౌత్‌జోన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ భరత్‌కుమార్, ఏఐటీయుసీ జిల్లా నాయకులు కె. రామస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


