అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా
తహసీల్దార్ గాయత్రి
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, బీఆర్‌ఎస్ నాయకులు బాల్‌రాజు, అశోక్‌ను మంగళవారం పోలీసులు తహసీల్దార్ ఎదుట బరైండోవర్ చేశారు. గ్రామాల్లో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేదిలేదని తహసీల్దార్ గాయత్రి హెచ్చరించారు. ప్రచారంలో అల్లర్లు, గొడవలు సృష్టించినా అరెస్టుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
దౌల్తాబాద్: విద్యుదాఘాతంతో ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని బాలంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల చిన్న ఆశప్ప ఎద్దు గ్రామంలోని మల్లేశ్ పొలంలో మేత మేస్తోంది. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్ వైరు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
తాండూరు టౌన్: ఫ్రిడ్జి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఓ ఇల్లు దగ్ధమైన సంఘటన తాండూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని 36వ వార్డులో చంద్రశేఖర్, స్వరూప అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. పూర్తిగా పొగ కమ్మేయడంతో నిద్రలో ఉన్న దంపతులు లేచి, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫ్రిడ్జి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని ఫర్నిచర్, బట్టలకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు నీళ్ల పైపు సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లంతా కాలిపోయిందని, వస్తువులు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని దంపతులు వాపోయారు.
పోగొట్టుకున్న 125 ఫోన్ల అందజేత
నాగోలు: ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలల్లో మిస్సైన 125 సెల్‌ఫోన్లను పోలీసులు గుర్తించి మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌బీనగర్ ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. బస్సు స్టాప్‌లు, బస్సు ఎక్కుతున్న సమయంలో ప్రయాణం వారాంతపు సంతలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లు చోరీకి గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మొబైల్ బ్యాంక్ యాప్‌లు, ఫోన్ పే, గూగూల్ పే, పేటీఎం నెంబర్ బ్లాక్ చేసుకోవాలని సూచించారు. ఫోన్ల రికవరీ చేయడంతో కీలక పాత్ర పోషించిన ఎల్‌బీనగర్ సీఐ కే. వినోద్‌కుమార్, డీఐ నాగార్జునరెడ్డి, డీఎస్సై నరేందర్, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఇబ్రహీంపట్నం: ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని గురునానక్ విద్యాసంస్థ వద్ద ప్రభుత్వ భూమిలో (గ్యాప్ ఏరియా)లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి ఆదేశానుసారం ఆర్‌ఐ సువర్ణ, సర్వేయర్ సాయి కృష్ణారెడ్డి, గ్రామపాలన అధికారులు శ్రీనివాస్, రాజు, మణికుమార్, వీఆర్‌ఏ మహేశ్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూమిలో, గ్యాప్ ఏరియాల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని తహసీల్దార్ హెచ్చరించారు.
అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా
అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా
అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా


