ఫ్యూచర్‌లో పనికొస్తుందని!
యాచారం: గ్రామ ప్రథమ పౌరుడిగా పేరొందిన సర్పంచ్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఉన్నత పదువులు అనుభవించినా సరే.. ప్రస్తుతం రిజర్వేషన్ కలిసొచ్చిన వారు తిరిగి సర్పంచ్ పీఠంపై కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీల మద్దతు లేకపోయిన సరే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. యాచారం, మంచాల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం తదితర మండలాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భవిష్యత్తులో సర్పంచ్ పోస్టు కీలకమవుతుందనే ఉద్దేశంతో పోటీకి సై అంటున్నారు. మిగిలిన గ్రామాల్లోనూ.. పెద్ద పదవులు చేసిన సీనియర్ నాయకులు సైతం సర్పంచ్ పోటీకి మొగ్గు చూపుతున్నారు.
ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించి..
యాచారం గ్రామానికి చెందిన కొప్పు సుకన్య మొన్నటి వరకు యాచారం మండల పరిషత్ అధ్యక్షురాలిగా(బీజేపీ నుంచి) ఐదేళ్లు పదవిలో కొనసాగారు. తాజా రిజర్వేషన్లల్లో యాచారం జీపీ ఎస్సీ మహిళకు కేటాయించడంతో తిరిగి సర్పంచ్‌గా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. బుధవారం నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
పీఏసీఎస్ చైర్మన్‌గా ఉంటూనే..
గునుగల్‌కు చెందిన తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి యాచారం పీఏసీఎస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గునుగల్ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ రావడంతో బీఆర్‌ఎస్ మద్దతుదారుడిగా బరిలో ఉండేందుకు డిసైడయ్యారు. బుధవారం నామినేషన్ దాఖలు చేస్తానన్నట్లు తెలిపారు.
వైస్ చైర్మన్ సైతం..
మంతన్‌గౌరెల్లికి చెందిన కారింగ్ యాదయ్యగౌడ్ యాచారం పీఏసీఎస్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసివచ్చిందని, పోటీకి సై అంటున్నారు.
ఉన్నత పదవులు చేపట్టినా..
మళ్లీ సర్పంచ్‌పై కన్ను
రిజర్వేషన్లు కలిసి రావడంతో
పోటీకి సిద్ధమవుతున్న నేతలు
ఫ్యూచర్‌సిటీ గ్రామాల్లో
ప్రథమ పౌరుడి పదవికి భలే క్రేజ్
ఫ్యూచర్‌లో పనికొస్తుందని!
ఫ్యూచర్‌లో పనికొస్తుందని!


