లోటుపాట్లు లేకుండా చూడండి
● ఎన్నికల నిర్వహణను సమర్థంగా పూర్తి చేయాలి
● జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. మూడో విడత ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా క్లస్టర్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ఆర్‌ఓలకు ఎన్నికల సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉషాకిరణ్, సూపరింటెండెంట్ యెల్లంకి జంగయ్యగౌడ్, ఎస్‌ఐ చందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


