ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20లక్షలు
కుల్కచర్ల: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బ్లాక్‌బీ అధ్యక్షుడు భరత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బోట్యానాయక్ తండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సంతోష్‌నాయక్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ప్రకటించారు. కాగా ఇక్కడ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అనంతరం పార్టీ నేతలను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పరిగి ఎమ్మేల్యే రామ్మోహన్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.20లక్షలు ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ఇవ్వనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, సంతోశ్ నాయక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి


