షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం
కొందుర్గు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధమైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి ఇదే ఊరికి చెందిన బుగ్గేశ్వర్, నారాయణలకు సంబంధించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సుమారు70 క్వింటాళ్ల పత్తిని తీయించి, పొలం సమీపంలో ఉన్న అజ్జు ఫామ్‌హౌస్‌లో నిల్వచేశాడు. సోమవారం ఉదయం ఫామ్‌హౌస్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెళ్లి చూడగా పత్తికి మంటలు అంటుకున్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనలో దాదాపు 20 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది. దీంతో తనకు రూ.1.60 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


