‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బోగమోని సురేశ్‌ను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. లగచర్ల ఘటనలో ఏ–2 ముద్దాయిగా ఉన్న సురేశ్‌ను పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తహసీల్దార్ కిషన్, పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గొడవలు సృష్టించినా, అల్లర్లకు పాల్పడినా అరెస్టు చేయడంతో పాటు రూ.లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
కళాశాల రికార్డుల పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం అకాడమిక్ ఆడిట్ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కళాశాల అభివృద్ధికోసం సిబ్బందికి సూచనలు చేశారు. కమిటీలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ ఇంతియాజుద్దీన్‌లు ఉన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. పీవీ గీతాలక్ష్మి పట్నాయక్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
లారీ కింద పడి యువకుడి దుర్మరణం
శంకర్‌పల్లి: లారీ కింద పడిన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం రాత్రి మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శుభం హల్సే(22) ప్రైవేటు ఉద్యోగి. తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని దూల్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని బైక్‌పై కొల్లూర్ వైపు వెళ్తుండగా.. ఇంద్రారెడ్డినగర్ వద్ద పక్కపక్కనే వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. శుభం హల్సే అక్కడే కింద పడిపోగా.. వెనక నుంచి వచ్చిన లారీ అతని పైనుంచి వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఫిలింనగర్ సెక్షన్ లైన్‌మెన్‌పై వేటు
సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను బంజారాహిల్స్ డివిజన్ ఫిలింనగర్ సెక్షన్ లైన్‌మెన్ కె.భాస్కర్‌పై డిస్కం వేటు వేసింది. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా నవంబర్ 28న డైరెక్టర్ సహా సీజీఎం ఇతర అధికారులు దుర్గభవానీ నగర్‌లో పర్యటించారు. అంతకు ఒక రోజు ముందే ఆయనకు ఈమేరకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను భేఖాతార్ చేయడంతో పాటు పైఅధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ డీఈ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
నిందితుడిపై కేసు నమోదు..
నాగోలు: ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ నగరానికి వలస వచ్చి ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటూ కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.అతడి ఇంటి సమీపంలో అదే రాష్ట్రానికి చెందిన కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమార్తె (14)కు మాయమాటలు చెప్పి శ్రావణ్‌కుమార్ అమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు.
‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్


