రెండు జీపీలు ఏకగ్రీవం
● పేర్కంపల్లి సర్పంచ్‌గా శాంతిబాయి
● రాంపూర్‌మీదితండాలోవెంకట్‌రెడ్డికి పదవి
● యునానిమస్ దిశగా మరిన్ని జీపీలు
యాలాల: మండలంలోని పేర్కంపల్లితండా సర్పంచ్‌గా శాంతిబాయి ఏకగ్రీవమయ్యారు. ఇటీవల వేసిన నామినేషన్లలో భాగంగా తండా నుంచి ఒకే దరఖాస్తు అందడంతో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. స్క్రూటినీ అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనున్నారు.
మరో మూడు పంచాయతీలు..
మండలంలోని మరో మూడు జీపీలు యునానిమస్ దిశగా సాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3న ఉండటంతో ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఏకగ్రీవం వైపు చర్చలు సాగిస్తున్నారు. జక్కేపల్లి, ముకుందాపూర్, బండమీదిపల్లి ఈజాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేసిన వారు ఉపసంహరణ చేసుకునేలా గ్రామపెద్దల సమక్షంలో ఒప్పందాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
యునానిమస్‌కు మొగ్గు చూపుతున్న జీపీలు
తాండూరు రూరల్: తాండూరు మండలంలో మరో గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రాంపూర్‌మీదితండా పంచాయతీకి జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ పదవి కోసం పి.వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, పట్లోళ్ల సావిత్రమ్మ, మోహన్‌నాయక్, రాంచందర్ నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా సోమవారం పంచాయతీ పరిధిలోని ప్రజలు, నాయకులు ఏకగ్రీవానికి చర్చలు జరిపారు. అభ్యర్థులు, స్థానికులు పట్లోళ్ల వెంకట్‌రెడ్డిని బలపర్చడంతో, మిగిలిన నలుగురు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ఎనిమిది వార్డులను సైతం ఏకగ్రీవం చేసుకున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు.
రెండు జీపీలు ఏకగ్రీవం


