పీహెచ్‌సీని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
ధారూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సందర్శించారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులు, ట్యాబెట్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. సిబ్బందిని పిలిపి సమస్యలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించే సౌకర్యం లేదని, దానికి ప్రతిపాదనలు సైతం పెట్టలేదని ఆమె తెలిపారు. ఆవరణ మొత్తం పిచ్చిమొక్కలు, గడ్డితో నిండిపోయి పాములకు ఆవాసంగా మారిందని డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగితే తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు వెళుతున్నామని, స్థానికంగా వైద్య సౌకర్యం కల్పించాలని రోగులు విన్నవించారు. ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ఎంపీహెచ్‌ఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి, ఎంపీహెచ్‌ఈఓ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.


