నామినేషన్‌లో తప్పులు దొర్లొద్దు
మోమిన్‌పేట: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని వెల్చాల్ క్లస్టరులో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అవసరమైన వారికి సహకారాలు అందించాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు బలపరిచే వ్యక్తిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా అమలయ్యేలా చూడాలని, నిర్ణీత గడువు లో పల నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టరు హర్ష్ చౌదరి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తనిఖీ
నవాబుపేట: నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు.
నోటిఫికేషన్ పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్‌కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


