అంబులెన్స్ సేవలు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి చెందిన సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం(ఇంధనం ఖర్చు మాత్రమే చెల్లించి) ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాన్ని సోమవారం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి వాహన సేవలు షురూ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్‌రెడ్డి, సంతోష్‌గౌడ్, ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 16 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగ్లీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలుగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్‌లను ఎమ్మెల్యే సోమవారం నియమించారు. వీరు గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అనంతగిరి: రుణాలు పొందిన వీధి విక్రయదారులు తమ ఈఎంఐలను విధిగా చెల్లించేలా అవగాహన కల్పించాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో టౌన్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో వీధి విక్రయదారుల నిమిత్తం తొలి, ద్వితీయ, తృతీయ విడత రుణాలు, బ్యాంకులచే రిటర్న్ అయిన అప్లికేషన్స్, మహిళ సంఘాల రుణాలు, ఎన్‌పీఏ సంబంధిత అంశాలు తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మహిళ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు కూడా నిర్ణయించిన విధంగా చెల్లించాలన్నారు. సమావేశంలో డీఎంసీ వెంకటేశ్, సంబంధిత బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన కె. అమరేందర్ రెడ్డి నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే.
అంబులెన్స్ సేవలు ప్రారంభం
అంబులెన్స్ సేవలు ప్రారంభం
అంబులెన్స్ సేవలు ప్రారంభం


