వైభవంగా గీతా జయంతి
వికారాబాద్‌లో సామూహిక గీతా పారాయణం చేస్తున్న గీతా వాహిని బృందం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో గణేశ్ కట్ట వద్ద గీతా వాహిని ఆధ్వర్యంలో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గీతాయజ్ఞం, సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఎనిమిది ఏళ్లుగా గీతా పారాయణంతోపాటు గీతా ప్రచారం చేస్తున్నామన్నారు. భగవద్గీతను పట్టణంలోని ఆయావాడలు, పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులరమేశ్‌కుమార్, నాయకులు రమేశ్‌గౌడ్, స్వాతి, పావని, లక్ష్మి, దమయంతి, దేవీనాయక్, రాజ్యలక్ష్మి, గీతా వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీత పుస్తకాలు పంపిణీ
కొడంగల్: పట్టణంలోని నేతాజీ పాఠశాలలో సోమవారం ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకుర్తి జయతీర్థాచారీ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. గీతా జయంతి సందర్భంగా తెలుగులో ఉన్న 100 భగవద్గీత పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు ప్రతి రోజు గీతా పారాయణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


