ట్యాంకును కూల్చివేయండి
కుల్కచర్ల: మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌లో ప్రమాదకరంగా ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును వెంటనే కూల్చివేయాలని మిషన్ భగీరథ ఇంట్రా చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రవికుమార్ సూచించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన అధికారులు ట్యాంకుతో ఎలాంటి ప్రమాదం జరగకముందే, తగిన జాగ్రత్తలు తీసుకుని కూల్చివేయాలన్నారు. నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదకరంగా మారిన ట్యాంకులు ఎక్కడ ఉన్నా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: శేరిగూడ గ్రామంలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీజీఎం డా. అజయ్ కే సూద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నిర్వహణ, లావాదేవీలు, పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ పాడురంగారెడ్డి, సీఈవో గణేశ్ ఆయనకు ఆయా విషయాలను వివరించారు. కార్యక్రమంలో టీఎస్‌సీఏబీ ఎండీ వైకే రావు, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్‌కుమార్, సంబంధిత అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.


