కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని ముజాహిద్‌పూర్‌కు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. నిబద్ధతతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చంద్రభూపాల్, బాలకృష్ణ, అంబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి


