వంతెన కిందకు దూసుకెళ్లిన కారు
అనంతగిరి: అదుపు తప్పిన ఓ కారు వికారాబాద్ బ్రిడ్జి పై నుంచి కింద పడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో ఎన్నెపల్లి నుంచి వికారాబాద్ వైపు వస్తుండగా.. వంతెన మూల మలుపు వద్ద వారు పయనిస్తున్న కారు.. అదుపు తప్పి కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయా లు కాలేదు. కారు పూర్తిగా ధ్వంసం అయింది. కాగా.. పొగమంచుతో మలుపు దగ్గరకు వచ్చే వరకు కనబడలేదని బాధితులు తెలిపారు.
భార్యను చంపిన భర్త
పోలీసుల అదుపులో నిందితుడు
తాండూరు రూరల్: కోపోద్రిక్తుడైన భర్త.. భా ర్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమైపె దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు.
దౌల్తాబాద్‌లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
దౌల్తాబాద్: మండల పరిధిలో రెండు గ్రామ పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్లే. మండలంలోని తిమ్మాయిపల్లి, బండివాడ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకుగాను ఒక్కో నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. బండివాడలో నూర్యనాయక్, తిమ్మాయిపల్లి పంచాయతీకి శాణమ్మ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
వెంగళరావునగర్: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జె.సందీప్ అనే యువకుడు గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలో ఉంటూ ఉద్యో గ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత మార్చి నెలలో తన స్నేహితుడి ద్వారా ఓంకార్ రూపేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు ఐటీ కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పా డు. అతడి మాటలు నమ్మిన సందీప్ రూ.1.60 లక్షలు ఇచ్చాడు. నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన సందీప్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఓం కార్ రూపేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి సందీప్ ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వంతెన కిందకు దూసుకెళ్లిన కారు
వంతెన కిందకు దూసుకెళ్లిన కారు
వంతెన కిందకు దూసుకెళ్లిన కారు


