ఆదివారం అంతంతే..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో రెండో విడతనామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు పత్రాల సమర్పననెమ్మదించింది. ఆయా మండలాలు,పరిధి గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి నామపత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించారు.
ధారూర్: మండల పరిధిలో 34 గ్రామ పంచాయతీలు, వార్డులు 286 ఉండగా.. సర్పంచు 35, వార్డులకు 17 దరఖాస్తులు అందాయని ఎంపీడీఓ నర్సింహులు తెలిపారు. సర్పంచ్ నామినేషన్లు ఇలా ఉన్నాయి. నాగసమందర్ 4, గురుచోట్ల 1, పీసీఎంతండా1, నాగారం 1, దోర్నాల 1, మోమిన్కలాన్ 1, అంతారం 5, మోమిన్‌కుర్దు 1, రాజాపూర్ 2, తరిగోపుల 1, ధారూరు 3, ధారూరు స్టేషన్ 2, రాంపూర్తండా 1, కేరెల్లి 3, ఎబ్బనూర్ 1, మున్నూరుసోమారం 4, కుక్కింద 1, నర్సాపూర్ 1, రుద్రారం 1 నామినేషన్లు దాఖలయ్యాయి.
33 జీపీలకు 38 పత్రాలు
నవాబుపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 33 గ్రామాలకు 38 సర్పంచ్, 276 వార్డులకు 50 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీఓ అనురాధ తెలిపారు.
మర్పల్లిలో..
మర్పల్లి: మండలంలోని 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచులకు 26, 264 వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీటీ జయరాంమ్ తెలిపారు.
బంట్వారంలో..
బంట్వారం: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదటి రోజు ఆదివారం అంతంత మాత్రంగానే కనిపించింది. మండలంలోని 12 పంచాయతీలకు 8, 106 వార్డులకు 12 నామినేషన్లు, అదే విధ ంగా కోట్‌పల్లి మండలంలోని 18 పంచాయతీలకు 21, 150 వార్డులకు 8 నామపత్రాలు అందాయని ఎంపీడీఓలు రాములు, హేమంత్ తెలిపారు.
మోమిన్‌పేటలో..
మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారంమందకొడిగా సాగింది. మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 263 వార్డులు ఉన్నాయి. 29సర్పంచ్, 49 వార్డు సభ్యులకు నామపత్రాలు దాఖలయ్యాయి. మండలంలో 8 క్లస్టర్లలో అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరిస్తున్నారు.
మందకొడిగా రెండో దశ నామినేషన్లు


