బీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరికలు
మర్పల్లి: మండల పరిధిలోని కోట్‌మర్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్‌లోని ఆయన స్వగృహంలో శ్రీనివాస్‌రెడ్డి, అనుచరులకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రఘుపతి రెడ్డి, రమేశ్‌గౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పనితీరు నచ్చకే ...
కుల్కచర్ల: ప్రభుత్వ పనితీరు నచ్చక బీఆర్‌ఎస్‌లోకి స్వచ్ఛందంగా చేరికలు ప్రారంభమయ్యామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కుల్కచర్ల మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి వలసలు
బీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరికలు


