కరన్‌కోట్ ఫైట్.. వెరీ హాట్
తాండూరు రూరల్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేజర్ పంచాయతీ కరన్‌కోట్ గ్రామం. పది వేల మంది జనాభా, 7 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు పదుల సంఖ్యలో నాపరాతి గనులున్నాయి. పంచాయతీకి పుష్కలంగా నిధులు వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మాజీ సర్పంచ్ వీణ భర్త, మాజీ ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా రాజ్‌కుమార్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. హేమంత్ కుమార్ 14 వార్డులకు సంబంధించి వార్డు సభ్యులు, ప్రతిపాదకులు అంతా సిద్ధం చేసుకుని చివరి నిమిషంలో అస్త్ర సన్యానం చేశాడు. ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కరన్‌కోట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
తప్పించింది ఎవరు..?
హేమంత్ కుమార్‌ను తప్పించిన నేత ఎవరనేది అంతుచిక్కడం లేదు. ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్లినా నోరు విప్పలేదు. ఏకగ్రీవం కాకుండా ఉందేందుకు బీఆర్‌ఎస్ యువ నాయకులు బోయ అశోక్, ప్రభాకర్‌గౌడ్ నామినేషన్ వేశారు. వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నట్లు సమాచారం. వీరు విత్‌డ్రా చేస్తే రాజ్‌కుమార్ సర్పంచ్‌గా ఏకగ్రీవం లాంఛనమే కానుంది. అయితే రాజ్‌కుమార్ గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు ప్రజల్లో సానుభూతి ఉందనే చర్చ వినిపిస్తోంది.
బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిచివరి నిమిషంలో పోటీకి విముఖత
బరి నుంచి తప్పించింది ఎవరని చర్చలు
పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లినానోరు విప్పని మాజీ ఉపసర్పంచ్‌హేమంత్‌కుమార్
మరో ఇద్దరు యువకులతోనామినేషన్ వేయించిన గులాబీ నేతలు
వారిని సైతం విత్‌డ్రా చేయించేందుకు అధికార పార్టీ నేతల యత్నం


