హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్‌ఎస్ పాలన కోరుకుంటున్న ప్రజలు
● మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, దీంతో అధికార పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో పూడూరు మండలం నుంచి 160 మంది, చౌడాపూర్, గండీడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచ్‌లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.


