సర్పంచ్ లాంఛనమే!
సంగాయిపల్లి.. ఏకగ్రీవం
బషీరాబాద్: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంతన్‌గౌడ్, హంక్యానాయక్ తండా, బాబునాయక్ తండాల్లో సర్పంచ్ స్థానానికి, అన్ని వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ స్థానాలు యునానిమస్ అయ్యాయి. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు.
భీమప్ప కుటుంబంలో ముగ్గురికి పదవులు
మంతన్‌గౌడ్ గ్రామం ఎస్టీ రిజర్వ్‌డ్ కావడంతో ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబం ఉంది. భీమప్ప ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. రెండు వార్డు స్థానాలు కూడా ఎస్టీ రిజర్వ్‌డ్ కావడంతో భీమప్ప కొడుకు ఎరుకలి మహేష్, కోడలు ఎరుకలి సుజాతకు నామినేషన్ వేశారు. వారు గెలుపు లాంఛనమైంది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు వరించాయి.
నజరానాతో..
ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి రూ.10లక్షలు, పెద్ద జీపీలకు రూ.20లక్షలు కేటాయిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హంక్యానాయక్ తండా, బాబు నాయక్‌తండా ప్రజలు గ్రామసభలు ఏర్పాటు చేసుకొని యునానిమస్ చేసుకోవాలని నిర్ణయించారు. హంక్యానాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానాలకు అనిత రాథోడ్ తోపాటు 6 వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బాబునాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానానికి జెర్పుల అనిత తోపాటు 8 మంది వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేయించారు. దీంతో అన్ని స్థానాలు ఏకగ్రావమయ్యాయి.
జెర్పుల అనిత
(బాబునాయక్‌తండా)
అనిత రాథోడ్
(హంక్యానాయక్‌తండా)
ఎరుకలి భీమప్ప, మహేష్, సుజాత(మంతన్‌గౌడ్)
జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
స్క్రూట్నీ అనంతరం అధికారిక ప్రకటన
నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పెరిగే అవకాశం
జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా జీపీల్లో ఒక్కరు చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడంతో గెలుపు లాంఛనమైంది. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. బషీరాబాద్ మండలంలో 3, యాలాల మండలంలో 5, దుద్యాల్, తాండూరు మండలాల్లో ఒకటి చొప్పన, పెద్దేముల్ మండలంలో 2, బొంరాస్ పేట మండలం నుంచి ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దుద్యాల్: మండలంలోని సంగాయిపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు రెండు రోజులుగా చర్చలు జరిపారు. వెంకట్‌రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కరు చొప్పన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వారి ఎన్నిక లాంఛనమైంది.
సర్పంచ్ లాంఛనమే!
సర్పంచ్ లాంఛనమే!
సర్పంచ్ లాంఛనమే!


