● యాలాల మండలంలో..
యాలాల: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంగెంకుర్దు పంచాయతీ జనరల్‌కు రిజర్వేషన్ ఖరారు కాగా, ఆ గ్రామానికి చెందిన సంగం సుధాలక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. లక్ష్మీనారాయణపూర్ జీపీ జనరల్ మహిళకు కేటాయించడంతో గుర్రాల నాగమణి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కిష్టాపూర్ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ గ్రామానికి చెందిన స్వప్న ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గంగాసాగర్‌లో జనరల్‌కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన మల్లేశం, సంగాయగుట్టతండా ఎస్టీ జనరల్‌కి రిజర్వ్ కావడంతో కిషన్ నాయక్ ఒక్కరే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక లాంఛనప్రాయమే.
సుధాలక్ష్మి (సంగెంకుర్దు)
నాగమణి
(లక్ష్మీనారాయణపూర్)
● యాలాల మండలంలో..


