నామినేషన్ సజావుగా నిర్వహించాలి
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ట్రైనీ కలెక్టర్(ఎన్నికల పరిశీలకుడు) చంద్రకిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని గౌతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి క్లస్టర్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. సర్పంచు, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో ఏమైన ప్రశ్నలు ఉంటే నివృత్తి చేయాలని ఆదేశించారు. శనివారంతో నామినేషన్ ముగుస్తుండటంతో ఆర్‌ఓ, అసిస్టెంట్ ఆర్‌ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విశ్వప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు వీరప్ప, ఫక్రోజీ తదితరులు ఉన్నారు.
ట్రైనీ కలెక్టర్ చంద్ర కిరణ్


