కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 2022 – 23, – 24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్‌రెడ్డి, అకడమిక్ అడ్వయిజర్లుగా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వసంతకుమారి, చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం రమేష్ ఆ ప్రక్రియ చేపట్టారు. కళాశాలలో వసతులపై వసంతకుమారి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్ విద్యా సంస్థల్లోని నాణ్యతను, ప్రమాణాలను సమగ్రంగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక అమలు, పరిశోధన, పరిపాలనా పనులు, తగు సూచనలు ఇవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్‌తో కళాశాలకు ఎంతో మేలు కలుగుతుందని, లోటు పాట్లను తెలుసుకోవడంతోపాటు ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తుందన్నారు. అడ్వయిజర్ల సూచనలు పాటిస్తూ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానమ్, అకడమిక్ కో ఆర్డినేటర్ టి.రాంబాబు, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
జ్యోతిబాపూలే
మార్గంలో నడుద్దాం
తాండూరు టౌన్: రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబాపూలే ఎంచుకున్న మార్గంలోనే నడుద్దామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలన, బాలి కా విద్య, సమానత్వం కోసం పూలే చేసిన పోరా టం అనిర్వచనీయమన్నారు. అణగారిని బడు గు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ రాణించాలనే ఆయన బలీయమైన కోరిక ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. నేటి యువత ఆయన పోరాటాన్ని అనుసరిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, బస్వరాజ్, పరమేష్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ ఆంక్షలు
వెనక్కి తీసుకోవాలి
తాండూరు టౌన్: అయ్యప్ప మాల ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ, హిందూ సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఈ మేరకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప మాల వేసిన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. హిందువుల ఆరాధ్య దైవం అయ్యప్ప మాలఽ వేయడం నేరం కాదన్నారు. హిందూ మతంపై కక్ష గట్టి మాల వేసిన పోలీసులపై చర్యలకు పూనుకోవడం సబబు కాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇట్టి విషయాన్ని పరిశీలించి ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, అయ్యప్ప గుడి కమిటీ స్వాములు మనోజ్, శ్రావణ్, సంతోష్ గౌడ్, వెంకటేష్, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, హిందూ వాహిని, విశాల్ హిందూ సంఘాల సభ్యులు శ్రీనివాస్, రామకృష్ణ, వినోద్, భద్రేశ్వర్, చంద్రశేఖర్, శ్రీహరి, కిరణ్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్


