నిర్వహించాలి
ఎన్నికలు సజావుగా
తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం మన్‌సన్‌పల్లి,మంబాపూర్ కందనెల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. నిబంధనల మేరకు అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రతన్‌సింగ్, అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు
యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేపడుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో ఇబ్బందులు లేకుండా ఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం మండలంలోని కోకట్ క్లస్టర్ పరిధిలో ఉన్న నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టే వివరాల నమోదు, సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ నిబంధనలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు ఖాతాలు తప్పక ఉండాలన్నారు. నామినేషన్ ఫారాలు నింపే సమయంలో అభ్యర్థులు తప్పులు లేకుండా నింపేలా సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి శ్రీనిజ, ఆర్‌ఓలు ఉన్నారు.


