కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
తాండూరు రూరల్: అఽధికార కాంగ్రెస్ పార్టీపై పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కరన్‌కోట్, మల్కాపూర్, సంగెంకలాన్, గౌతాపూర్ గ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా తిరిగారు. కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలం బీఆర్‌ఎస్‌కు కంచుకోట అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మోసం చేసిందన్నారు. పింఛను మొత్తం రూ.4 వేలకు పెంచుతామని మాయమాటలు చెప్పిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారు. సంగెంకలాన్ గ్రామంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి కామిని మీనాక్షిని గెలిపించాలని గ్రామస్తులకు కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు రత్నాకర్, రాజేందర్‌రెడ్డి, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్‌చారి, సునీల్, రాజప్పగౌడ్, శకుంతల తదితరులు పాల్గొన్నారు.


