ప్రాణం తీసిన అజాగ్రత్త
నవాబుపేట: మద్యం మత్తులో అజాగ్రత్త, అతి వేగంగా వచ్చిన కారు డ్రైవర్ ఓ బైక్‌ను ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేందర్‌రెడ్డి తన బైక్‌పై గురువారం రాత్రి మైతాప్‌ఖాన్‌గూడకు వెళ్తున్నాడు. అదే సమయంలో చక్రంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులో మైతాప్‌ఖాన్‌గూడ నుంచి దేవరంపల్లి వైపు వెళుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మార్గమధ్యలో అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన మహేందర్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్‌ను ఢీకొట్టిన కారు అనంతరం వెనకాల వస్తున్న డీసీఎంను సైతం ఢీకొంది. తోటి ప్రయాణికులు కారు డ్రైవర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఎస్‌ఐ పుండ్లిక్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, మూడేళ్ల కొడుకు ఉన్నారు.
● బైక్‌ను ఢీకొట్టిన కారు
● అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం
ప్రాణం తీసిన అజాగ్రత్త


