పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

Nov 28 2025 11:35 AM | Updated on Nov 28 2025 11:41 AM

పీసీస

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు తాండూరు: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ జాదవ్‌ గురువారం నగరంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. ఇటీవల డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌తో కలిసి పీసీసీ చీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం బంట్వారం: పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీజేపీ జిల్లా కో కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండ కేంద్రమైన కోట్‌పల్లిలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మెజార్టీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులను గెలిపించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు నరోత్తంరెడ్డి, కోట్‌పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్‌, నాయకులు కృష్ణయాదవ్‌, నరేందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, రవి, రాజు, బాల్‌రాజ్‌, దత్తు, శేఖర్‌యాదవ్‌, రాఘవేందర్‌గౌడ్‌, నవీన్‌, రవీందర్‌రెడ్డి, నవాజ్‌ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు నేరం 4న బహిరంగ వేలం భూసేకరణ గడువు పొడిగింపు

బీజేపీ జిల్లా కో కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి

ధారూర్‌: జిల్లాలో బాల్య వివాహాల విముక్తి కోసం సాధన సంస్థ ఆధ్వర్యంలో ఽగురువారం ధారూర్‌, స్టేషన్‌ ధారూర్‌, నాగసముందర్‌, రాంపూర్‌, గడ్డమీది గంగారం, అవుసుపల్లి, కొండాపూర్‌ కలాన్‌, గట్టెపల్లి, దోర్నాల, రుద్రా రం గ్రామాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీ తీశారు. బాల్య వివాహాలు చేయడం నేర మన్నారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్‌ నర్సింలు, సభ్యులు శ్వేత, గౌరీ, అసీమాబేగం, తౌఫిక్‌, రోజా, శివలక్ష్మి, కన్యాకుమారి, మమ త, రమేష్‌, పవన్‌ పాల్గొన్నారు.

అనంతగిరి: అనంతగిరిగుట్ట ఆలయం వద్ద టెంకాయల విక్రయానికి, వాహనాల పార్కింగ్‌ కోసం వేలం నిర్వహించనున్నట్లు ఆయల ఈ వో నరేందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు (కార్తీక మాసం నెల రోజులు మినహ) టెంకాయలు విక్రయించుకోవచ్చని తెలిపారు. డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షలు డిపాజిట్‌ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు.

దుద్యాల: మండలంలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ గడువును మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు గురువారం తహసీల్దార్‌ కిషన్‌ తెలిపారు. గత నోటిఫికేషన్‌ ఈ నెల 29వ తేదీతో ముగుస్తుండటంతో మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. 1,174 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 934 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉండటంతో మరికొంత సమయం పట్టేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు గడువు పొడిగించినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు 1
1/3

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు 2
2/3

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు 3
3/3

పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement