ఎంపీని కలిసిన నాయకులు
చేవెళ్ల: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పట్టణ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నగరంలోని ఎంపీ నివాసానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులతో ఆయన కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, విశ్రాంతి అనంతరం చేవెళ్ల పార్లమెంట్‌లోని ప్రజలను కలిసేందుకు వస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పరిస్థితిలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసిమెలసిపనిచేయాలని ఎంపీ సూచించారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, వార్డుసభ్యుల నుంచి బీజేపీ అభ్యర్థులు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకర్‌గౌడ్, కృష్ణరెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, క్రిష్ణ, శ్రీనివాస్, అశోక్, గణేశ్, భీమ్‌రెడ్డి, రఘు, జయసింహరెడ్డి, అభిషేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


