లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్
అనంతగిరి: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లు, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలిండియా కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్, నాయకులు బుగ్గప్ప, రామకృష్ణ, చంద్రయ్య, ఆయా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.


