చదువుతో పాటు ఆటల్లో రాణించాలి
పరిగి: విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలపై శ్రద్ధ చూపాలని, చదువుతో పాటు ఆటల్లో రాణించాలని టోర్నీ నిర్వాహకులు అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో వికారాబాద్ జట్టు వితేగా నిలిచింది. టోర్నీలో ఆరు జోన్లు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పెద్దెముల్, మోమిన్‌పేట్ జట్లు పాల్గొన్నాయి. పరిగి, వికారాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకోగా.. వికారాబాద్‌పై పరిగి ఘనవిజయం సాధించింది. అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేశారు.


