మహిళల ఆర్థిక ప్రగతికే రుణాలు
అనంతగిరి: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం వడ్డీలేని రుణాలు ఇస్తోందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లాలోని 9,232 స్వయం సహాయక సంఘాలకు విడుదలైన రూ.7.38 కోట్లను మంగళవారం వారి ఖాతాల్లో జ మ చేసినట్లు తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని 2,781 సంఘాలకు రూ.2.23 కోట్లు, కొడంగల్ లోని 1,101 సంఘాలకు రూ.84 లక్షలు, తాండూరులోని 2,113 సంఘాలకు రూ.1.77 కోట్లు, వికారాబాద్ పరిధిలోని 2,664 సంఘాలకు రూ. 2.20 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఈ మొత్తా న్ని ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(టీబీఓసీడబ్లుడబ్లుబి) తరఫున 10 రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సులు, సామాజిక భద్రత పథకాల కార్యక్ర మానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఓసీడబ్ల్యూ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా కార్మిక శాఖ అధికారి వాల్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య, అంకిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


