మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
కందుకూరు: మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ప్రభుత్వం చేయూతనందిస్తోందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని నవారు కిష్టమ్మ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 2,086 గ్రూపులకు రూ.2.41 కోట్ల వడ్డీ లేని రుణాలను ఖాతాల్లో జమ చేశామన్నారు. డీఆర్‌డీఓ శ్రీలత మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే ఆడ పిలల్లకు వివాహాలు చేయాలని, అప్పటి వరకు బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఏఎంసీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్లు చంద్రశేఖర్, పాండుయాదవ్, డీపీఏం యాదయ్య, ఎంపీఓ గీత, ఏపీ ఎం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్


