ప్రతి పల్లైపె ఫోకస్ పెట్టండి
● తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ● పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ తనిఖీ
తాండూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పల్లైపె ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో గ్రామా ల్లో గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బెల్టు షాపులను నియంత్రించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. పోలీసులు వివాదాల జోలికి వెళ్లరాదని సూచించా రు. ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించాల ని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు.


