విధుల్లో అలసత్వం వద్దు
● పెండింగ్ ఫైళ్లనుసత్వరం పరిష్కరించాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: పెండింగ్ ఫైళ్లను సత్వరం పరిష్కరించాలి ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, శాఖాపరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


