
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కలెక్టర్‌కు అంగన్‌వాడీల వినతిపత్రం
అనంతగిరి: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యను నిర్వహించాలని అంగన్‌వాడీ టీచర్స్, వెల్ఫేర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యదర్శి ఎం.భారతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారుల కోసం వెలిసిన ప్రైవేటు స్కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనుభవం, అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని నినదించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ.5 లక్షలకు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.32 వేలు చెల్లించాని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వర్షంలో తడుస్తూనే గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైహిపాల్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మి, మంజుల, వనజ, బేబీ, రేణుక, వసంత, పుష్ప, అమృత తదితరులు పాల్గొన్నారు.