
దరఖాస్తుల ఆహ్వానం
కొడంగల్ రూరల్: పట్టణ శివారులోని కేజీబీవీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా బోటని(పీజీ సీఆర్‌టీ) సబ్జెక్టు బోధించేందుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ స్రవంతి తెలిపారు. ఎంఎస్‌సీ (బోటని) బీఈడీ అర్హత ఉండి ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, పూర్తి వివరాలకు విద్యాలయంలో సంప్రదించాలని ఆమె తెలిపారు.
నేడు, రేపు స్పాట్ అడ్మిషన్లు
అనంతగిరి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మంగళ, బుధవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సీట్లకు 19న, ప్రైవేట్ సీట్లకు 20న ఆయా కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 77807 40880లో సంప్రదించాలన్నారు.
బాధ్యతలు చేపట్టిన
డీటీ సందీప్
తాండూరు రూరల్: తాండూరు డిప్యూటీ తహసీల్దార్‌గా సందీప్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసి డిప్యూటేషన్‌పై ఏడాది పాటు తాండూరు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ యథావిధిగా తాండూరు డీటీగా విధుల్లో చేరారు.
ముదిరాజ్‌లను
బీసీ ఏలో చేర్చాలి
కొడంగల్: ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలో కలపాలని ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ముదిరాజ్‌లను బీసీ ఏలో కలిపితే మేలు జరుగుతుందన్నారు. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని బీసీ కమిషన్ నివేదిక ఇస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్, ముదిరాజ్ సంఘం నాయకులు వేణుగోపాల్, సత్యపాల్, వెంకటయ్య, నర్సప్ప, బాలయ్య, మధుసూదన్, హన్మంతు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు తీసుకోండి
తాండూరు: ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, తాండూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో సోమవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తాండూరులో డెంగీ కేసులు ప్రబలకుండా చూడాలన్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. మందుల కొరత ఉంటే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. తాండూరులో దోమల వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య పనులతో పాటు ఫాగింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని సోమవారం విశ్రాంత ఐఏఎస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆల య నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శరత్ దంపతులు లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శరత్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు సదానందం, సభ్యులు హనుమంతు, అర్చకులు ప్రమోద్, వీరేశ్ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం