
నేత్రపర్వం.. శివపార్వతుల కల్యాణం
వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారాన్నిపురస్కరించుకుని పార్వతీపరమేశ్వరుల కల్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకం చేశారు. 11 గంటలకు వేద మంత్రోచ్ఛారణ నడుమ అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన షెడ్‌ను ప్రారంభించారు. వేడుకల్లో వీరశైవ సమాజం ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పట్టణ, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– అనంతగిరి

నేత్రపర్వం.. శివపార్వతుల కల్యాణం