
కన్నీటి వరద!
ధారూరు: మండల పరిధిలోని మోమిన్‌కలాన్ క్లస్టర్ పరిధిలోని భారీగా పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ విస్తరణ అధికారి మల్లేశం తెలిపారు. శనివారం ఆయన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు. పంటలు పూర్తిగా పాడయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. 21 ఎకరాల్లో పసుపు, 113 ఎకరాల్లో పత్తి, 63 ఎకరాల్లో మొక్కజొన్న, 72 ఎకరాల్లో కంది పంటలకు నష్టం జరిగిందని ఏఈఓ తెలిపారు. మోమిన్‌కలాన్ కత్వ నుంచి పొలాల్లోకి భారీగా వరద రావడంతో ఇసుక మేటలు వేసి పత్తి పంటలు తుడిచిపోట్టుకుపోయాయన్నారు. ధారూరు క్లస్టర్‌లో 18 ఎకరాల పత్తి, 5 ఎకరాల వరి, 7ఎకరాల పెసర పంటలకు నష్టం వాటిల్లిందని ఏఈఓ సంతోష్ తెలిపారు.
● భారీ వర్షాలతో కొట్టుకుపోయిన పంటలు
● పొలాల్లో ఇసుక మేటలు
● కన్నీటి పర్యంతమవుతున్న కర్షకులు

కన్నీటి వరద!