
బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి
● బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు
● ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు శ్రీశైలం ముదిరాజ్
పరిగి: హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, జర్నలిస్ట్ కొరివి కృష్ణ స్వామిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సంఘం నాయకులతో కలిసి శనివారం పట్టణంలో కృష్ణస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరానికి తొలి మేయర్‌గా విధులు నిర్వర్తించిన కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆశోక్‌కుమార్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం తాలూకా గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్యముదిరాజ్, కార్యదర్శి కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బాబయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.