
గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
తాండూరు రూరల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి గుంతలో పడి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంబాపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణుకుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చెంచు అంజిలయ్య(41), భార్య లక్ష్మి, కూతురు స్వాతితో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లక్ష్మి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌కు మంగళవారం భర్త, కూతురితో కలిసి మంబాపూర్ వచ్చారు. బస్సు దిగిన వెంటనే అంజిలయ్య శ్రీమీరు చైతన్యనగర్‌కి వెళ్లండి, నేను తర్వాత వస్తానుశ్రీ అని భార్యాబిడ్డకి చెప్పి పంపించాడు. అదే రోజు రాత్రయినా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అసాధ్యమైన ప్రాంతాల్లో వెతికారు. మొబైల్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం మంబాపూర్ గ్రామ శివారులోని మైసమ్మ దేవాలయం వద్ద గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని చూసిన లక్ష్మి తన భర్త అంజిలయ్యగా గుర్తించారు. మంగళవారం రాత్రి తాగిన మైకంలో మంబాపూర్ నుంచి చైతన్యనగర్‌కు వెళ్లే క్రమంలో గుంతలో పడి మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తాగిన మైకంలో అత్తారింటికి
వస్తుండగా ఘటన