
ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’
శంకర్‌పల్లి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పట్టణ బీజేపీ నేతల ఆధ్వర్యంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలంతా ఒక్కటే అని, ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను నిరంతరం గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపల్, మండల అధ్యక్షులు దయాకర్‌రెడ్డి, లీలావతి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాములుగౌడ్, ప్రతాప్‌రెడ్డి, వాసుదేవ్ కన్నా, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతతో దేశభక్తిని చాటుదాం
షాద్‌నగర్‌రూరల్: దేశంలోని ప్రజలందరూ ఐకమత్యంతో ఏకతాటిపైకి వచ్చి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు గురువారం తిరంగా ర్యాలీ ఇన్‌చార్జి చెట్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ అధ్యక్షతన హర్‌ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెయిన్‌రోడ్డులో గల దుకాణాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు సురేష్, అశోక్, మురళీ తదితరులు పాల్గొన్నారు.