
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి
● ఎంపీడీఓ బన్సీలాల్
షాద్‌నగర్‌రూరల్: కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు, నాగులపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయన వాగుల వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి రక్షణ చర్యలను చేపట్టారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి వాగుల మీదుగా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున.. అత్యవసర సమయాల్లో తప్పా ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సూచించారు. వాగులు, చెరువుల పరిసర ప్రాంతాలలోకి ప్రజలు రావొద్దని సూచించారు. అత్యవసర సమాచారం కోసం మండల పరిషత్ కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాలలో 8686793747, 9441947364 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, ముజఫర్నిసాభేగం, గ్రామస్తులు పాల్గొన్నారు.
నందిగామలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నందిగామ: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన నందిగామలోని తహసీల్దారు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గురువారం తహసీల్దారు రాజేశ్వర్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం, జంతు నష్టం తదితర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే గ్రామస్తులు, లేదా బాధితులు తహసీల్ధారు కార్యాలయంలో ఫోన్ నం.8019884605, 98660 23923లను సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు.
మూడురోజుల పాటు అందుబాటులో..
కేశంపేట: వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో కంట్రోల్ రూంను తహసీల్దార్ అజాంఅలీ ఏర్పాటు చేశారు. శుక్రవారం సీనియర్ అసిస్టెంట్ మచ్చేందర్ (7799363553), శివ జూనియర్ అసిస్టెంట్ (9398094490), శనివారం గిర్దావర్ చెన్నకేశవులు (9948044523), రికార్డు అసిస్టెంట్ జంగయ్య (9912170411), ఆదివారం జూనియర్ అసిస్టెంట్ మహేశ్ (9441579527), జూనియర్ అసిస్టెంట్ జంగేశ్ (9848206029)లు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.