అనంతగిరి: ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కోరారు. శుక్రవారం వికారాబాద్‌లో యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం అర్హత లేని వారికి 3 జిల్లాల్లో డీఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ అధ్యక్షుడు దేవయ్య, నాయకులు జాంప్లా, శివప్ప, బాలకృష్ణ, బాబు శ్రీనివాస్, వీరయ్య సంతోష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.