భారీ వర్షం.. పంటలకు నష్టం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. పంటలకు నష్టం

Aug 9 2025 8:42 AM | Updated on Aug 9 2025 8:42 AM

భారీ

భారీ వర్షం.. పంటలకు నష్టం

విన్యాసాలు అదుర్స్‌
స్వచ్ఛ శంకర్‌పల్లిలో భాగస్వాములుకండి

దోమ: భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి. గురువారం సాయంత్రం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో గంటపాటు వర్షం కురిసింది. ఈ క్రమంలో మొక్కజొన్న, పత్తి పంటల్లో నీరు చేరాయి. దీంతో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

పరిహారం అందించాలి

మండల వ్యాప్తంగా 36 పంచాయతీల్లో పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశారు.ండల పరిధిలోని 1,118 ఎకరాల్లో మొక్కజొన్న, 1,830 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

నాలుగు ఎకరాల్లో..

నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గురువారం కురిసిన వర్షానికి పంట మొత్తం పాడైంది. అప్పు తెచ్చి సాగు చేశాం. అప్పులు తీర్చే మార్గం ఆవేదన చెందుతున్నాం. అధికారులు పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.

– బాల్‌రాజ్‌, రైతు, బొంపల్లి

పరిహారంపై స్పష్టత లేదు

రైతులు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

– ప్రభాకర్‌రావు, ఏఓ, దోమ

న్యాయవాది బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య

చర్లపటేల్‌గూడలో విషాదం

ఇబ్రహీంపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్‌ పరిధిలో గురవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపటేల్‌గూడకు చెందిన న్యాయవాది పి.నరేందర్‌గౌడ్‌(34)కు ఇదే వృత్తిలో ఉన్న చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇరువురూ ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నరేందర్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అతన్ని వెతుకుతున్న క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలోని పశువుల కొట్టంలో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఇబ్రహీంపట్నం: గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో దేశ రక్షణ, వాయుసేన దళాలు శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రానికి చెందిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ), భారత రక్షణ వాయుసేన (ఐఏఎఫ్‌) సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో శ్రీహై–ఇంటెన్సిటీ రూఫ్‌ టాప్‌ స్లిదరింగ్‌శ్రీ పేరిటన విన్యాసాలు ప్రదర్శించాయి. ఉగ్రమూకల దాడులు, యుద్ధ పరిస్థితులు, ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటే విపత్కర, అత్యవసర సమయాల్లో ప్రజలను ఏ విధంగా కమాండోలు కాపాడతారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ గగన్‌దీప్‌ సింగ్‌ కోహ్లి, ఎండీ హెచ్‌ఎస్‌ సైనీ, ఎన్‌ఎస్‌జీ దళాల కమాండోలు, అధికారులు పాల్గొన్నారు.

నేలకొరిగిన పత్తి, మొక్కజొన్న

పరిహారం అందించాలని రైతుల వినతి

భారీ వర్షం.. పంటలకు నష్టం 1
1/4

భారీ వర్షం.. పంటలకు నష్టం

భారీ వర్షం.. పంటలకు నష్టం 2
2/4

భారీ వర్షం.. పంటలకు నష్టం

భారీ వర్షం.. పంటలకు నష్టం 3
3/4

భారీ వర్షం.. పంటలకు నష్టం

భారీ వర్షం.. పంటలకు నష్టం 4
4/4

భారీ వర్షం.. పంటలకు నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement