
వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను జయప్రదం చేయాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహించనున్నందున అతిథుల కోసం వేదికపై ఏర్పాట్లు చేయాల న్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా స్టాల్స్ ఏర్పా టు చేయాలన్నారు. ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, ఆర్‌డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు.