స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: జిల్లా ప్ర జలకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. అన్నాచెల్లెలు, అ క్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అన్నారు. తన సోదరుడు గొప్పగా ఉండాలని, తనకు కొండంత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ సోదరి రాఖీ కడుతుందన్నారు.
బాధ్యతలు చేపట్టిన
మంగీలాల్
అనంతగిరి: జిల్లా రెవెన్యూ అధికారిగా మంగీలాల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగీలాల్ వరంగల్ హనుమకొండ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.
వాగును విడిపించకుండా తవ్వకాలు ఏమిటి ?
చిలుకవాగు పనులను అడ్డుకున్న స్థానిక రైతులు
తాండూరు: రియల్ వ్యాపారులు కబ్జా చేసిన చిలుక వాగును విడిపించకుండా, తమ పొలాల నుంచి వాగును తరలించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మార్గం సాయిపూర్ ప్రాంతంలో శుక్రవారం చేపట్టిన వాగు తవ్వకం పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిలుక వాగు పరివాహక ప్రాంతం తమ పొలాల మధ్య నుంచి వెళ్లదని తెలిపారు. ఆక్రమణలను తొలగించకుండా తమ భూముల పైనుంచి తవ్వకాలు చేపట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు.
పాల ఉత్పత్తులపై
అవగాహన
యాచారం: పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్‌రెడ్డి, ఫార్మర్ డీన్ డాక్టర్ రఘునందన్ తదితరులు శాసీ్త్రయ పద్ధతిలో పాడిపశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. పశుపోషణ, తక్కువ ఖర్చుతో షెడ్ల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వంటి అంశాలను వివరించారు. కలాకండ్, పన్నీరు, చన్నారసగుల్లా, రసమలై, మజ్జిగ, లస్సీ తదితర పదార్థాల తయారీపై అవగాహన కల్పించి, శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రత్నాకర్, శశికుమార్ పాల్గొన్నారు.
రాఖీ శుభాకాంక్షలు
రాఖీ శుభాకాంక్షలు