నష్టం అంచనాకు సర్వే
● పారిశ్రామికవాడ కోసం రైతులు ఇచ్చిన పొలాల్లో పర్యటించిన అధికారులు ● వ్యవసాయ బోర్లు, పశువుల పాకలు, చెట్లు, ఫామ్ హౌస్‌ల లెక్కింపు ● ప్రత్యేక పరిహారం అందిస్తాం: తహసీల్దార్ కిషన్ ● పర్యవేక్షించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్
దుద్యాల్: పారిశ్రామికవాడకు భూములు ఇచ్చి న రైతుల పొలాల్లో శుక్రవారం అధికారులు పర్యటించారు. దుద్యాల్ మండలం హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో సర్వే నిర్వహించారు. రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన పొలాల్లోని వ్యవసాయ బోర్లు, పశువుల పాకలు, ఇళ్లు, విలువైన చెట్లను పరిశీలించారు. ఆయా గ్రామాలకు చెందిన 140 మంది రైతుల పొలాల్లో పైపేర్కొన్న వాటికి విలువ కట్టారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పొలాల్లోని ఇళ్లు, ఫామ్ హౌస్‌ల విలువను అంచనా వేశారు. హార్టి, సిరి కల్చర్ అధికారులు పండ్ల తోటల ను, అటవీ శాఖ అధికారులు పెద్ద పెద్ద చెట్లను, ఎకై ్సజ్ అధికారులు ఈత చెట్లను, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు బోర్ల విలువ ను అంచనా వేశారు. ఈ ప్రక్రియ రెండు రోజు ల పాటు సాగుతుందని తహసీల్దార్ కిషన్ తెలి పారు. ప్రక్రియ పూర్తికాగానే ఏ రైతు పొలంలో ఏ మేరకు నష్టం జరుగుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, అనంతరం పరిహారం మంజూరవుతుందని తెలిపారు. పది రోజుల క్రితం హకీంపేట్ గ్రామా నికి చెందిన కొంత మంది రైతులకు ఈ తరహా పరిహారం అందజేసినట్లు ఆయన తెలిపారు.
పోలీసు బందోబస్తు మధ్య..
లగచర్ల ఘటన నేపథ్యంలో హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు. సర్వే అధికారికి ఒక ఎస్‌ఐ, కొంత మంది పోలీసులను కేటాయించారు. ఇలా గ్రూపులుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ ను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్ ఎకై ్సజ్ సీఐ వెంకటేశ్వరులు, దుద్యాల్, కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ ఎస్‌ఐలు యాదగిరి, సత్యనారాయణ, రహూఫ్, రవిగౌడ్, కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు,మహిళా పోలీసులు, ఆర్‌ఐ నవీన్ కుమా ర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


