అనాథ పిల్లలకు వసతి, భోజనం
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: జిల్లాలో 7 నుంచి 18 సంవత్సరా ల లోపు అనాథ పిల్ల లు ఉన్నా.. ఇప్పటి వరకు వసతి గృహాల్లో చది వి వేసవి సెలవుల్లో ఎక్కడ ఉండాలో తెలియని చిన్నారులకు వసతి, భోజన సదుపాయం కల్పించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి పిల్లలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు కాల్ చేస్తే వారు బాలసదన్‌లో, ఇతర చైల్డ్ కేర్ సెంటర్లలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వెంకటేశం, డీసీపీఓ శ్రీకాంత్, బీఆర్‌బీ కోఆర్డినేటర్ కాంతారావు, సంక్షేమ శాఖ జిల్లా అధికారి జయసుధను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
భూ భారతితో
రైతులకు మేలు
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
కుల్కచర్ల: భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. మంగళవారం కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో కొత్త చట్టంపై అవగాహన సదస్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. కుల్కచర్లలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, వైస్ చైర్మన్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్, తహసీల్దార్ ప్రభులు, ఎంపీడీఓ సోమలింగం, సీనియర్ అసిస్టెంట్ లింగయ్య, యువజన కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు రాము, సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాస్కర్, మార్కెట్ కమిటీ డైరక్టర్ భరత్ కుమార్ రెడ్డి, వ్యవసాయాధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఎస్పీ నారాయణరెడ్డి
మోమిన్‌పేట: నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ నారాయణరెడ్డి కోరారు. మంగళవారం మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 34 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. కేసుల విచారణకు నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద, వ్యాపారులు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకట్, ఎస్‌ఐ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
పిడుగు పడి కొబ్బరిచెట్టుపై మంటలు
తాండూరు రూరల్: మండల పరిధిలోని కోత్లాపూర్‌లో మంగళవారం పిడుగుపడింది. గ్రామానికి చెందిన బైండ్ల రాంచందర్ ఇంట్లోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. కొబ్బరి చెట్టు సమీపంలో మేకాల వెంకటప్ప బాత్‌రూంలో స్నానం చేస్తుండగా చేతికి స్వల్పగాయామైంది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పిడుగు పడటంతో గ్రామస్తులు సంఘటనస్థలానికి చేరుకొని దెబ్బతిన్న కొబ్బరిచెట్టును పరిశీలించారు.
అనాథ పిల్లలకు వసతి, భోజనం
అనాథ పిల్లలకు వసతి, భోజనం
అనాథ పిల్లలకు వసతి, భోజనం


